ఉద్యోగాల భర్తీని అడ్డుకునే వాళ్లను నిలదీయాలి : సీఎం రేవంత్

ఉద్యోగాల భర్తీని అడ్డుకునే వాళ్లను నిలదీయాలి : సీఎం రేవంత్

గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేదని..తాము వచ్చాక ఏడాదిలోనే 59 వేల ఉద్యోగాలిచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాము ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు. 

  బాబు జగ్జీవన్ రాం భవన్ లో గురుకుల విద్యార్థులకు అవార్డులందించారు సీఎం రేవంత్.. ఈ సందర్బంగా మాట్లాడిన రవంత్ ఉన్నత శిఖరాలకు చేరులంటే చదువు ఒక్కటే మార్గం అని చెప్పారు. కార్పొరేట్ కు ధీటుగా యంగ్ ఇండియా స్కూళ్లు నిర్మిస్తామన్నారు. చదువుతోనే సమాజంలో అసమానతలు తొలగిపోతాయన్నారు. అన్నా అని పిలిస్తే అందుబాటులో ఉంటానన్నారు రేవంత్.

సీఎం రేవంత్ కామెంట్స్

  • సురవరం స్పూర్తిని కొనసాగించేలా తెలుగు యూనివర్శిటీకి ఆయన పేరు పెట్టుకున్నాం
  • సురవరం నిజాంకు వ్యతిరేకంగా ప్రజల్లో  చైతన్యం తెచ్చారు
  • మహిళా వర్శిటికీ చాకలి ఐలమ్మ పేరు పెట్టాం
  • టెక్స్ టైల్ యూనివర్శిటీకి కొండాలక్ష్మన్ బాపూజీ పేరు పెట్టాం
  • కులం వల్ల ఎవరికీ సమాజంలో గుర్తింపు రాలేదు
  • బాగా చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్
  • విద్యార్థులు పాతికేళ్లు నిబద్ధతతో చదువుకుంటే  భవిష్యత్ బంగారం
  • సర్కార్ ప్రోత్సాహంతోనే ఎందరో ఐపీఎస్ లు ,ఐఏఏస్ లు అయ్యారు
  • ప్రజాప్రభుత్వంలో దళిత బిడ్డలకు పట్టం కట్టాం
  •  చిన్న వయసులో  కావ్య, వంశీకృష్ణ ఎంపీలుగా రాణిస్తున్నారు
  • సమాజ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములుగా కావాలి
  • సమసమాజ నిర్మాణమే లక్ష్య్యంగా పనిచేస్తున్నాం
  • కార్పొరేట్ కు ధీటుగా యంగ్ ఇండియా స్కూళ్లు తీసుకొస్తున్నాం
  •  కొందరు యంగ్ ఇండియా స్కూల్లు అవసరమా అని అంటున్నారు.
  • చదువుతోనే సమాజంలో అసమానతలు తొలగిపోతాయి
  • విద్యార్థుల త్యాగాల తోనే తెలంగాణ వచ్చింది
  •  చదువుకున్న విద్యార్థులుకు మేకలు,  గొర్లను బర్లను మేపుకోమన్నారాన చెప్పారు
  • పదేళ్లు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారు
  • పదేళ్లలో ఒక్క ఉద్యోగానికైనా నోటిఫికేషన్ ఇవ్వలేదు
  • ఉద్యమంలో బడుగు,బలహీన వర్గాల పిల్లలే ప్రాణాలిచ్చారు.
  • పదేళ్లు అధికారం అనుభవించిన వారి పిల్లలు ప్రాణాలివ్వలేదు
  • 18 నెలల్లోనే  59 వేలకు పైగా ఉద్యోగాలిచ్చాం
  • ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ విద్యార్థులకు మెరుగైన విద్య అందడాన్ని ఓర్వలేకపోతున్నారు
  • ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నాం
  • 2011 నుంచి  ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టలేదు
  • మేం వచ్చాక 500లకు పైగా పోస్టులు భర్తీ చేశాం
  •  పరీక్ష పత్రలను అంగట్లో  పల్లీబఠాణీ లెక్క అమ్ముకున్నరు
  • గ్రూప్ 1 పరీక్షీలో ఎంపికైన వారిలో 80 శాతం దళితులే
  • ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తుంటే అడ్డం పడుతున్నారు.
  • మా ఉద్యోగాలకు ఎందుక అడ్డు వస్తున్నారని విద్యార్థులు నిలదీయాలి
  • పదేళ్లు ముఖ్యంత్రి ఎవ్వర్నీ కలవలేదు
  • మేం నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాం
  • మాది దొరల పాలన కాదు..ప్రజాపాలన

  •