హైదరాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా నంగు నూరు మండలం నర్మెట్ట వద్ద ఆయిల్ ఫెడ్ఆధ్వర్యంలో నిర్మించిన ఆయిల్ పామ్ ప్రాసె సింగ్ యూనిట్‌ను ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మంగళ వారం యూనిట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వ హిం చి మాట్లాడారు. దాదాపు రూ.300 కోట్లతో ఆయిల్ పామ్ యూనిట్‌ను నిర్మించి నట్టు తెలిపారు.
ఈ యూనిట్ ప్రారంభ దశలో గంటకు 30 టన్నుల సామర్థ్యంతో పని చేస్తుం దని, భవిష్యత్తులో గంటకు 120 టన్నుల వరకు విస్తరించేలా రూపకల్పన చేశామని వివరించారు. ఈ యూనిట్ అందుబాటు లోకి రావడంతో ఆయిల్ పామ్ రైతులకు ప్రాసెసింగ్, నిల్వ, మార్కెటింగ్ సౌకర్యా లు సులభతరం అవుతాయని తెలిపారు. ఆధునిక సాంకేతికతతో నూనె తయారీ వల్ల నాణ్యత పెరిగి, రైతులకు మెరుగైన ధరలు లభిస్తాయన్నారు.
యూనిట్ ప్రారంభోత్సవం సందర్భంగా అగ్రికల్చర్, అల్లాయిడ్ సెక్టార్ల ఆధ్వర్యంలో మార్చి 20 నుంచి 22 వరకు 'రైతు మేళా' నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మేళాలో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, కొత్త యంత్రాలు, ఆయిల్ పామ్ సాగు విధానాలు, ప్రభుత్వ పథకాలపై రైతు లకు అవగాహన కల్పించనున్నట్టు పేర్కొన్నా రు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్స హించి రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్య క్రమం విజయవంతానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
