జూలై 4న రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్.

జూలై 4న రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్.
  • లక్డీకాపూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెట్రో స్టేషన్ ఏరియాలో ఏర్పాటు

హైదరాబద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్డీకాపూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాజీ ఉమ్మడి ఏపీ సీఎం, దివంగత కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించనున్నారు. రోశయ్య జయంతి సందర్భంగా జరిగే ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. లక్డీకాపూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెట్రో స్టేషన్ సమీపంలో 9 అడుగుల ఎత్తు, 450 కిలోల బరువుతో రోశయ్య విగ్రహాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం ద్వారా రోశయ్యకు నివాళులర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. 

మచ్చలేని నాయకుడు రోశయ్య: సీఎం రేవంత్ 

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య జయంతి(శుక్రవారం) సందర్భంగా ఆయనను సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 16 సార్లు ఆర్థిక శాఖ మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్యకే దక్కిందన్నారు. ఆయన మచ్చలేని నాయకుడని చెప్పారు. రోశయ్య  జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలిచ్చామని, ఇది తమ ప్రభుత్వం ఆయనకిచ్చిన   గౌరవమని పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీకి సీఎంగా రాజీనామా చేసిన తర్వాత తమిళనాడు గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కూడా ఆయన సేవలందించారని సీఎం గుర్తుచేశారు.