ఇయ్యాల(సెప్టెంబర్ 4) కొడంగల్కు సీఎం రేవంత్

ఇయ్యాల(సెప్టెంబర్ 4) కొడంగల్కు సీఎం రేవంత్
  • అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, పరిశీలన

కొడంగల్, వెలుగు : సీఎం రేవంత్​రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్​లో శుక్రవారం, శనివారం పర్యటించనున్నారు. నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన 100 బెడ్స్ క్రిటికల్​కేర్​బ్లాక్, ఆర్​అండ్​బీ గెస్ట్​హౌజ్, స్కూల్ బిల్డింగ్ ను ప్రారంభించడంతో పాటు హకీంపేట్​లో నిర్మాణంలో ఉన్న ఎడ్యుకేషన్​హబ్​పనులను పరిశీలించనున్నారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధిపై ఆఫీసర్లతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. తర్వాత కొడంగల్​ప్రభుత్వ జూనియర్​కాలేజీలో ఏర్పాటు చేసిన సభకు హాజరై ప్రసంగించనున్నారు.

సీఎం పర్యాటన నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లను గురువారం కలెక్టర్ దీపక్ తివారి పరిశీలించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, ప్రొటోకాల్, వైద్య సిబ్బంది, అత్యవసర వైద్య సేవలు తదితర ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టాలని సూచించారు. ఆఫీసర్లు సమన్వయంతో పనిచేయాలని
 ఆదేశించారు.