తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి..మీ భద్రతకు మాదే బాధ్యత

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి..మీ భద్రతకు మాదే  బాధ్యత

తెలంగాణలో పెట్టుబడులకు ఎలాంటి ఢోకా లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  శిల్పారామంలో టూరిజం కాంక్లేవ్ 2025 కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్.. పెట్టుబడులకు  హైదరాబాద్ అత్యంత అనుకూలమైన నగరం అని అన్నారు. పౌరులకు అత్యుత్తమ భద్రత కల్పిస్తున్నామని చెప్పారు రేవంత్.
 
పదేండ్లు టూరిజానికి పాలసీ లేదన్న సీఎం రేవంత్.. కాంగ్రెస్ వచ్చాక సమగ్ర పాలసీ తెచ్చామన్నారు.   ఏ రాష్ట్రానికి లేని  టూరిజం స్పాట్లు  తెలంగాణకు ఉన్నాయన్నారు. ఎకో,హెల్త్, మెడికల్ టూరిజాన్ని  ప్రోత్సహించాని నిర్ణయించామని తెలిపారు.  తెలంగాణలో పెట్టుబడులు పెడితే.. భద్రత కల్పించే బాధ్యత తమదేనన్నారు.   

Also Read : మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకే ATC, స్కిల్, స్పోర్ట్స్ యూనివర్శిటీలు

టెంపుల్ టూరిజాన్ని మరింతగా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు రేవంత్.  హైదరాబాద్ లో రక్షణ శాంతిభద్రతల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు.  శాంతి భద్రతల విషయంలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని కేంద్రం ప్రకటించిందన్నారు.  హైదరాబాద్ లో  15 వేలకోట్ల పెట్టుబడులు అభినందనీయమని.. టూరిజం మినిస్టర్ జూపల్లిని అభినందిస్తున్నానని చెప్పారు సీఎం రేవంత్ .