తమిళనాడు రాజకీయాల్లో కొత్త సంప్రదాయానికి స్వీకారం చుట్టారు టీవీకే పార్టీ చీఫ్, సీఎం విజయ్. ఎన్నికల్లో ఓడిన డీఎంకే పార్టీ చీఫ్ స్టాలిన్ ఇంటికి వెళ్లారు. ఎమ్మెల్యేగానూ ఓడిన స్టాలిన్.. అసెంబ్లీలోకి అడుగుపెట్టలేదు. తొలిరోజు అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లి పరామర్శించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే చెన్నై సిటీలోని స్టాలిన్ ఇంటికెళ్లారు సీఎం విజయ్.
సీఎం విజయ్ కు ఉదయనిధి స్టాలిన్ ఆలింగనంతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఇంట్లోకి వెళ్లిన సీఎం విజయ్ ను స్టాలిన్ ఎదురు వచ్చి మరీ ఆలింగనం చేసుకుని.. ఇంట్లోకి తీసుకెళ్లటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
తమిళనాడు రాజకీయాల్లో గతంలో ఎప్పుడూ ఇలాంటి సంస్కృతి లేదు. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు 50 ఏళ్లు ఉప్పు నిప్పుగా ఉన్నాయి. పార్టీలు ఓడినా.. గెలిచినా దూరంగానే ఉన్నారు ఆ పార్టీ నేతలు.
ఇప్పుడు విజయ్ అందుకు భిన్నంగా వ్యవహరించారు. అధికారం కోల్పోయిన డీఎంకే పార్టీ చీఫ్ స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ పరామర్శించటం.. ఆ సందర్భంగా సీఎం విజయ్ తో స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ వ్యవహరించిన తీరు.. స్వాగతం పలికిన తీరు తమిళనాడు జనం సంభ్రమాశ్చర్యంగా చూస్తున్నారు. గతంలో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు కొట్టుకునేయి.. ఇప్పుడు అలా కాకుండా సీఎం విజయ్ కొత్త సంప్రదాయంగా.. పగలు, ప్రతీకారాలు కాకుండా తమిళనాడు రాష్ట్రం కోసం పాడుపడదాం.. రాజకీయాలు వేరు.. వ్యక్తిగతం వేరు అనే విధంగా కొత్త రాజకీయ సంప్రదాయానికి తెర తీశారు అంటున్నారు తమిళనాడు జనం.
ఇక్కడ విశేషం ఏంటంటే.. విజయ్ సీఎం కావటానికి అవసరం అయిన ఎమ్మెల్యేల మద్దతు ఇచ్చిన పార్టీలు అన్నీ డీఎంకే కూటమిలోనివే. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ముస్లిం లీగ్ పార్టీలు అన్నీ డీఎంకే కూటమి కింద ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినవే. ఈ సందర్భంగానే స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ అభినందనలు తెలిపాడా ఏంటీ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
#WATCH | Chennai: Tamil Nadu CM Vijay meets former CM and DMK President MK Stalin and former Dy CM Udhayanidhi Stalin at their residence.
— ANI (@ANI) May 11, 2026
(Source: DMK) pic.twitter.com/xsmH7uzoeZ
