విద్యా సమీక్షా కేంద్రంలో.. సీఎంవోకు ప్రత్యేక లాగిన్ ఇవ్వండి:సెక్రటరీ అజిత్ రెడ్డి

విద్యా సమీక్షా కేంద్రంలో.. సీఎంవోకు ప్రత్యేక లాగిన్ ఇవ్వండి:సెక్రటరీ అజిత్ రెడ్డి
  • అధికారులకు సీఎంవో సెక్రటరీ అజిత్ రెడ్డి ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్కూళ్ల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు విద్యా సమీక్షా కేంద్రం (వీఎస్‌‌‌‌కే) లో సీఎంవో అధికారులకు ప్రత్యేక లాగిన్ సిద్ధం చేయాలని అధికారులను సీఎంవో సెక్రటరీ అజిత్ రెడ్డి  ఆదేశించారు. మంగళవారం ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌‌‌‌లో ఏర్పాటు చేసిన వీఎస్‌‌‌‌కే కేంద్రాన్ని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ కృష్ణ ఆదిత్యతో కలిసి పరిశీలించారు. 

ఈ సందర్భంగా విద్యార్థులు, టీచర్ల హాజరు, ఉచిత పుస్తకాలు, యూనిఫాంల పంపిణీ, మధ్యాహ్న భోజనం, లర్నింగ్ అవుట్‌‌‌‌కమ్స్ మాడ్యూల్స్‌‌‌‌ను విజిట్ చేశారు. యూడైస్ ప్లస్ పోర్టల్, ఐఎస్ఎంఎస్, డీఎస్సీ ఎఫ్‌‌‌‌ఆర్ఎస్ తదితర ఆధునిక యాప్‌‌‌‌ల ద్వారా డేటాను సేకరిస్తున్న తీరును  అభినందించారు.   సౌలత్​లకోసం ఉన్న మాడ్యూల్‌‌‌‌లో కొన్ని మార్పులు చేయాలని సూచించారు.