సింగరేణి కార్మికుడికి తీవ్రగాయాలు

సింగరేణి కార్మికుడికి తీవ్రగాయాలు

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా జీడీకే-11 ఇంక్లైన్​లో ఎల్​హెచ్​డీ సెక్షన్​లో బుధవారం  ప్రమాదం జరిగింది. కోల్  కట్టర్ గా పని చేస్తున్న కొలనూరు ఐలయ్య గనిలో బ్లాస్టింగ్  అనంతరం గునపంతో చెటాయి చేస్తుండగా సైడ్  ఫాల్  అయింది. దీంతో నడుము, కుడి కాలుపై బొగ్గు పెల్లలు పడగా, తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన కార్మికుడిని అధికారులు వెంటనే గోదావరిఖని సింగరేణి ఏరియా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు.

విషయం తెలుసుకున్న ఐఎన్​టీయూసీ సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్​ ఎస్.నర్సింహారెడ్డి, ఏరియా వైస్​ ప్రెసిడెంట్​ కె.సదానందం ఆసుపత్రికి చేరుకొని కార్మికుడి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్  కార్పొరేట్  హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెఫర్  చేయాలని కోరగా, డాక్టర్లు వెంటనే కార్మికుడిని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. అలాగే టీబీజీకెఎస్​ ఏరియా వైస్​ ప్రెసిడెంట్​ వడ్డేపల్లి శంకర్​ హాస్పిటల్​లో కార్మికుడిని పరామర్శించారు.