హైదరాబాద్ ఎయిర్ పోర్టులో రూ.50 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్ ఎయిర్ పోర్టులో రూ.50 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విదేశాల నుంచి  కొకైన్ ని స్మగ్లింగ్ చేస్తున్న ఒకరిని ఎయిర్ పోర్ట్ అధికారులు ఆగస్టు 2న అదుపులోకి తీసుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... లావోస్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ వ్యక్తి మహిళల హ్యాండ్ బ్యాగ్ కింది భాగంలో కొకైన్ దాచాడు. 

డీఆర్ఐ అధికారులు అనుమానం వచ్చి అతన్ని తనిఖీ చేయగా ఐదు కిలోల కొకైన్ పట్టుబడింది. పట్టుబడిన కొకైన్ మార్కెట్ విలువ రూ.50 కోట్లు ఉంటుందని అంచనా. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఎయిర్ పోర్ట్ లో తరచూ డ్రగ్స్, బంగారం అక్రమ రవాణా చేస్తుండటం కలకలం రేపుతోంది.