- బుధవారం సాయంత్రం6 గంటల వరకు గడువు
హైదరాబాద్, వెలుగు: వివిధ కారణాలతో రౌండ్–1, రౌండ్–2 సీట్లను వదులుకోవాలనుకునే పీజీ మెడికల్ అభ్యర్థులకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) అవకాశం కల్పించింది. అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు సీట్ల రిజిగ్నేషన్కు గడువు ఇచ్చింది.
రౌండ్–2లో అప్గ్రేడ్ కాని రౌండ్–1 అభ్యర్థులు, రౌండ్–2లో కొత్తగా సీటు పొంది జాయిన్ అయినవారు, అలాగే రౌండ్–2లో అప్గ్రేడ్ అయి ఆ సీటులో జాయిన్ అయినవారు.. సెక్యూరిటీ డిపాజిట్ జప్తు నిబంధనతో నిర్దేశిత గడువులోపు తమ సీటుకు రిజిగ్నేషన్ చేయవచ్చని పేర్కొంది. అయితే, సీటును 'ఫ్రీజ్' చేసుకున్న అభ్యర్థులు నేరుగా తమకు కేటాయించిన కాలేజీకి వెళ్లి రిజిగ్నేషన్ చేయాల్సి ఉండగా, 'ఫ్లోట్' ఎంచుకున్న అభ్యర్థులు ఆన్లైన్ పోర్టల్ ద్వారా రిజిగ్నేషన్ సబ్మిట్ చేయాలని సూచించింది.
