పంజాగుట్ట పీఎస్ లో సీపీ మహేశ్ భగవత్..ఆకస్మిక తనిఖీ చేసిన కమిషనర్

పంజాగుట్ట పీఎస్ లో సీపీ మహేశ్ భగవత్..ఆకస్మిక తనిఖీ చేసిన కమిషనర్
  •     రేపు విజిట్​ చేయనున్న డీజీపీ

పంజాగుట్ట, వెలుగు: హైదరాబాద్​నగర పోలీస్​ కమీషనర్​మహేష్​ మురళీధర్​ భగవత్​ సోమవారం పంజాగుట్ట పోలీస్​ స్టేషన్​ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్​లోని రికార్డులు, సిబ్బంది పనితీరును పర్యవేక్షించారు. 

ఏఐ మోడల్​పోలీస్​స్టేషన్​గా తీర్చిదిద్దేందుకు చేస్తున్న ఏర్పాట్లపై ఆరా తీశారు. పనులు సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. మోడల్​ఏఐ పోలీస్​స్టేషన్​విజిట్​చేయడానికి డీజీపీ సీవీ ఆనంద్​ బుధవారం పంజాగుట్టకు వస్తున్నారని ప్రకటించారు.