- 45 ఫ్లాట్లకు స్పందన
- చదరపు గజానికి గరిష్ఠంగా రూ.19 వేల బిడ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: రంగారెడ్డి జిల్లాలోని ఇన్ములనర్వ లే అవుట్‌లో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ –-వేలానికి కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. సోమవారం నిర్వహించిన వేలంలో 45 ఫ్లాట్లు అమ్ముడుపోగా..రూ.6.67 కోట్ల ఆదాయం సమకూరింది.
ఈ -వేలంలో చదరపు గజానికి గరిష్ఠంగా రూ.19 వేల ధర పలికింది. అన్ని ప్లాట్లకు వచ్చిన బిడ్లను పరిగణనలోకి తీసుకోగా, వెయిటెడ్ యావరేజ్ ధర చదరపు గజానికి రూ.16,345గా నమోదైంది.
