75 మంది సర్పంచులకు 11 నెలలుగా వేతనాల్లేవ్‌‌‌‌!

75 మంది సర్పంచులకు 11 నెలలుగా వేతనాల్లేవ్‌‌‌‌!
  • ఆధార్, బ్యాంకు వివరాలు ఇవ్వకపోవడంతో నిలిపివేత

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సుమారు 75 మంది సర్పంచులకు 11 నెలలుగా గౌరవ వేతనం అందడం లేదు. ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించకపోవడంతోపాటు సాంకేతిక సమస్యల వల్ల వారి ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో 12,760 గ్రామ పంచాయతీలు ఉండగా.. గతేడాది డిసెంబర్‌‌‌‌లో జరిగిన ఎన్నికల్లో 12,702 చోట్ల కొత్త సర్పంచులు ఎన్నికయ్యారు. వీరికి ప్రభుత్వం నెలకు రూ.6,500 చొప్పున గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంది.

అయితే తొలుత ఏడు నెలలపాటు చెల్లింపులు నిలిపివేసిన ప్రభుత్వం.. ఆ తర్వాత వేతనాలు జమ చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం మిగతా సర్పంచులకు ప్రతినెలా రూ.6,500 ఖాతాల్లో జమ చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఆధార్, బ్యాంకు వివరాలు సరిగా అందించని సుమారు 75 మందికి మాత్రమే సాంకేతిక కారణాలతో చెల్లింపులు నిలిచిపోయాయని వెల్లడించారు.