సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనగానే మనకు గుర్తొచ్చేది.. ఏసీ రూమ్, ల్యాప్‌టాప్, కోడింగ్, లక్షల్లో శాలరీ. కానీ న్యూయార్క్‌కు చెందిన ఒక 28 ఏళ్ల యువ ఇంజనీర్ మాత్రం వీటన్నింటికీ భిన్నంగా ఆలోచించాడు. తను చేసే ఫుల్ టైమ్ ఐటీ ఉద్యోగానికి ఎక్కడా ఆటంకం కలగకుండా.. ఖాళీ సమయాల్లో కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్లే వినూత్న బిజినెస్ సర్వీస్ ప్రారంభించాడు. కేవలం పార్ట్ టైమ్ సైడ్ బిజినెస్‌గా మొదలైన ఈ క్రేజీ ఐడియా.. ఇప్పుడు అతనికి నెలకు ఏకంగా రూ.6 లక్షలు సంపాదించి పెడుతోందట.
న్యూయార్క్ నగరంలోని లోయర్ మన్‌హట్టన్‌లో నివసించే కోబీ గుడ్‌హార్ట్ అనే యువకుడు అక్కడ ఒక ఐటీ కంపెనీలో ఇంజనీరింగ్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అమెరికా ఇంధన శాఖకు సంబంధించిన మిలియన్ డాలర్ల క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ లోన్‌లను అతను హ్యాండిల్ చేస్తుంటాడు. అయితే 2023లో న్యూయార్క్ వచ్చిన తర్వాత తనకు ఎంతో ఇష్టమైన పెంపుడు జంతువులకు దూరమయ్యాననే ఫీలింగ్ అతనిలో మొదలైంది. ఆ లోటును భర్తీ చేసుకోవడానికి పొరుగువారి కుక్కలను సరదాగా వాకింగ్‌కు తీసుకెళ్లడం ప్రారంభించాడు. ఆ సరదాయే 2025లో 'గుడ్‌హార్ట్ డాగ్ కో' అనే ఒక లగ్జరీ పెట్-కేర్ కంపెనీ స్థాపించడానికి పునాది వేసింది.
కోబీ తన ఆఫీస్ వేళలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఈ బిజినెస్ షెడ్యూల్‌ను సెట్ చేసుకున్నాడు. ఉదయం ఆఫీస్‌కు వెళ్లడానికి ముందు, మధ్యాహ్నం లంచ్ బ్రేక్‌లో, ఆపై ఆఫీస్ అయిపోయాక సాయంత్రాలు, వీకెండ్స్‌లో కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్తాడు. మార్కెట్లో వందల సంఖ్యలో ఉన్న సాధారణ డాగ్-వాకింగ్ సర్వీసుల లాగా కాకుండా.. ధనవంతులను టార్గెట్ చేస్తూ దీనిని ఒక ప్రీమియం లగ్జరీ సర్వీస్ గా మార్చాడు. కుక్కల సైజ్, ప్రవర్తన, యజమానుల అవసరాలను బట్టి భారీగా ఛార్జ్ చేస్తాడు.
లోయర్ మన్‌హట్టన్ లోని ధనవంతులు, బిజీగా ఉండే కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకోవడంతో కోబీ బిజినెస్ ఊపందుకుంది. ప్రస్తుతం రోజుకు 10 నుండి 20 కుక్కలను అతను చూసుకుంటున్నాడు. డిమాండ్ విపరీతంగా పెరగడంతో.. మధ్యాహ్నం పూట వాకింగ్ కోసం ఒక అసిస్టెంట్‌ను కూడా హైర్ చేసుకున్నాడంట. దీంతో అతని కంపెనీ టర్నోవర్ ఇప్పుడు ఏడాదికి లక్షల డాలర్లకు పెరిగిందని చెప్పాడు.
కోబీ మాటల్లో చెప్పాలంటే.. తీవ్రమైన ఒత్తిడితో కూడిన ఐటీ ఉద్యోగం తర్వాత, మూగజీవాలతో గడపడం ఎంతో మానసిక ప్రశాంతతను ఇస్తుందట. జనవరి నెల చలిలో తెల్లవారుజామునే లేచి కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్లడం కాస్త కష్టమే అయినా.. తాను ఆ పనిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని చెబుతున్నాడు. భవిష్యత్తులో ఈ పెట్-కేర్ బిజినెస్‌ను మరింత విస్తరించి, దీనినే తన ఫుల్ టైమ్ కెరీర్‌గా మార్చుకోవాలనేది అతని ప్లాన్.
