కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ వద్ద… కూలిన వాకోవర్ బ్రిడ్జి

కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ వద్ద… కూలిన వాకోవర్ బ్రిడ్జి

రిజర్వాయర్ వద్ద గోప్యంగా మరమ్మతులు

భారీ క్రేన్లతో శిథిలాల తరలింపు..

సిద్దిపేట/గజ్వేల్, వెలుగు: సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ వద్ద శుక్రవారం రాత్రి వాకోవర్ బ్రిడ్జి కూలింది. ప్రాజెక్టు నుంచి సంగారెడ్డికి నీరివ్వడానికి కెనాల్ నిర్మిస్తున్నారు. కెనాల్ కు నీటిని వదిలే రెగ్యులేటర్ వద్దకు వెళ్లేందుకు నిర్మించిన వాకోవర్ బ్రిడ్జి శుక్రవారం రాత్రి కూలిపోయింది. అధికారులు అత్యంత గోప్యంగా వాటి శిథిలాలను ఏరివేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. శనివారం కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద భారీ క్రేన్లతో శిథిలాలను తొలగించడమే కాకుండా అత్యవసర మరమ్మతులు ప్రారంభించారు. అదే సమయంలో ప్రాజెక్టు చుట్టూ పోలీసులను మోహరించారు. రిజర్వాయర్ కు దాదాపు 4 కి.మీ. దూరం నుంచే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఆ దారిలో ఎవరూ వెళ్లకుండా రాకపోకలను నియంత్రించారు.