ఖమ్మం టౌన్, వెలుగు : వెలుగుమట్ల గ్రామంలోని సర్వే నెం.147, 148, 149 లో భూదాన్ భూములపై జిల్లా యంత్రాంగం చేపట్టిన కూల్చివేతలు పూర్తిగా చట్టబద్ధమైనవని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 31 ఎకరాల 7 గుంటల భూదాన్ భూమి ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.
ఈ భూమి విలువ సుమారు రూ.250 కోట్లకు పైగా ఉంటుందని పేర్కొన్నారు. సీసీఎల్ఏ, హైకోర్టు ఆదేశాల మేరకు భూదాన్ బోర్డు భూమిని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ ఆస్తిని కాపాడామని తెలిపారు. ఈనెల 24న ఇండ్ల కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, దానిని కోర్టు తిరస్కరించినట్లు వెల్లడించారు. హైకోర్టు స్టే ఉన్న నిర్మాణాలను మినహా మిగిలిన భూమిని స్వాధీనం తీసుకున్నట్లు తెలిపారు.
