
- హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్
హైదరాబాద్, వెలుగు: మానసిక ఎదుగుదలకు క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ పేర్కొన్నారు. శుక్రవారం జింఖానా గ్రౌండ్లో హైదరాబాద్ జిల్లా యువజనోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత దేశానికి వెన్నెముక లాంటి వారని, చదువుతోపాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ లోనూ పాల్గొనాలని సూచించారు.
లక్ష్యసాధనలో ముందుకు వెళ్లాలన్నారు. జిల్లాలో యువతకు భవిష్యత్ లో మంచి ప్రణాళికలు చేసి వారికి సహకరిస్తామన్నారు. ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చేసిన యువ కళాకారులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ జిల్లా యువజన, క్రీడా అధికారి సుధాకర్ రావు, జాతీయ యువజన అవార్డు గ్రహీతలు భగవాన్ దాస్, వెంకటేశ్ గౌడ్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.