యాదాద్రి, వెలుగు: మిల్లులకు వడ్ల లారీలు వచ్చినా అన్లోడ్లేటు ఎందుకు చేస్తున్నారని యాదాద్రి కలెక్టర్ అనురాగ్‌జయంతి సీరియస్అయ్యారు. బుధవారం అడిషనల్ కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి జిల్లాలోని వలిగొండలోని రైస్ మిల్లును ఆయన తనిఖీ చేశారు. మిల్లులో వడ్ల స్టాక్ ఎంతుందని ఆరా తీశారు. రోజుకు ఎన్ని లారీలు వస్తున్నాయని, అన్లోడ్ చేయడానికి ఎంత టైమ్ పడుతోందని ప్రశ్నించారు.
వచ్చిన లారీలను వచ్చినట్టే ఎప్పటికప్పుడు ఎందుకు అన్లోడ్ చేయడం లేదని ప్రశ్నించారు. హమాలీల ప్రాబ్లం ఉందని చెప్పడంతో హమాలీలను ఎక్కువగా తీసుకోవాలని ఆదేశించారు. ఏ ఒక్కలారీ కూడా మిల్లులో ఆగకూడదని సూచించారు. అనంతరం బ్యాగుల్లోని సీఎంఆర్ రైస్‌ను కలెక్టర్ పరిశీలించారు. డీసీఎస్వో రోజారాణి, మండల ఆఫీసర్లు ఉన్నారు.
