నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్లపై చర్యలు : కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా

నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్లపై చర్యలు : కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా
  •     కరీంనగర్​ కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్ టౌన్, వెలుగు: లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జిల్లాస్థాయి మల్టీమెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి  శివకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ, నిబంధనలు ఉల్లంఘించే కేంద్రాలు, హాస్పిటళ్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భ్రూణ హత్యలను నివారించేలా అవగాహన కల్పంచాలని ప్రధాన న్యాయమూర్తి  సూచించారు. డీసీపీ వెంకటరమణ, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

కొండ వేణుమూర్తికి రఘునాథం ఎక్స్​లెన్స్ అవార్డు 

కరీంనగర్, వెలుగు: రేకుర్తి లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్ చైర్మన్ కొండా వేణుమూర్తిని వీఎఫ్ వై రఘునాథం ఎక్స్ లెన్స్ అవార్డుకు ఎంపిక చేసినట్లు వెంకట్ ఫౌండేషన్ చైర్మన్ గంపా వెంకట్ మంగళవారం వెల్లడించారు. స్వచ్ఛంద సేవ కార్యక్రమాల్లో వేణుమూర్తి చేసిన సేవలకుగానూ ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఆయనకు ఈ నెల 23న కలెక్టర్ చిత్రా మిశ్రా అవార్డును అందజేయనున్నారు.