రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యత్వం తీసుకోవాలి : కలెక్టర్ చిత్రామిశ్రా

రెడ్ క్రాస్ సొసైటీలో  సభ్యత్వం  తీసుకోవాలి : కలెక్టర్ చిత్రామిశ్రా
  •     కలెక్టర్ చిత్రామిశ్రా 

కరీంనగర్ టౌన్,వెలుగు: 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యత్వం తీసుకోవాలని కరీంనగర్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చిత్రామిశ్రా సూచించారు. సోమవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రాస్ సభ్యత్వ నమోదు ప్రత్యేక డ్రైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. అనంతరం ప్రజావాణిలో కలెక్టర్ పాల్గొని 187 దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజావాణి అప్లికేషన్లను పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంచొద్దని అధికారులను ఆదేశించారు. 

తన మరిది  కొడుకు వేల్పుల వెంకటేశ్ ఆస్తి అతని పేరున రాయాలని ఒత్తిడి చేస్తూ బెదిరిస్తున్నాడని గంగాధర  మండలం ఉప్పరమల్యాల గ్రామానికి  చెందిన వేల్పుల రాధమ్మ అనే వృద్ధురాలు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేశారు. నెల కింద సైతం ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నా ఎలాంటి చర్య తీసుకోలేదని, ఇప్పటికైనా న్యాయం  చేయాలని కోరారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కేశవరెడ్డి, జిల్లా కార్యదర్శి రాధాకృష్ణారెడ్డి,  అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో మహేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.