రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఆయిల్‌పామ్ సాగు ద్వారా దీర్ఘకాలం ఆదాయం పొందొచ్చని, రైతులు ఆ పంట సాగుకు ముందుకు రావాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ పిలుపునిచ్చారు. గురువారం ఆయిల్‌పామ్ సాగుపై కలెక్టరేట్‌లో ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫార్మర్స్ రిజిస్ట్రీ కింద జిల్లాలోని రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.
చనిపోయిన వారిపేర్లు, డబుల్ ఎంట్రీ లేకుండా పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ కింద జిల్లాకు మంజూరైన పరికరాలకు రైతులు దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. త్వరలో 100 ఎకరాల్లో ఆయిల్‌పామ్ మెగా ప్లాంటేషన్‌కు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. సమావేశంలో డీఏవో అఫ్జల్ బేగం, హార్టికల్చర్ ఆఫీసర్ శరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఒత్తిడికి లోన్ కావద్దు
ఎల్లారెడ్డిపేట, వెలుగు: పరీక్షల టైంలో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఒత్తిడికి లోనుకావొద్దని కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ హైస్కూల్‌ను ఆమె సందర్శించారు. స్కూల్‌లో నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదులు, సైన్సు ల్యాబ్ నిర్మాణ పనులను తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనులను పరిశీలించి, అధికారులు, కాంట్రాక్టర్‌కు పలు సూచనలు చేశారు. 20 రోజుల్లో పనులు పూర్తి చేసి, వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.
అనంతరం పదో తరగతి స్టూడెంట్స్ క్లాసు రూమ్ కు వెళ్లి వారితో కలెక్టర్ మాట్లాడారు. అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న మంద స్వరూప అనే లబ్ధిదారు ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. తొందరగా పూర్తి చేసి గృహ ప్రవేశానికి సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్‌తోపాటు డీఈవో జగన్‌మోహన్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి అఫ్జల్ బేగం, హౌసింగ్ డీఈ ముజఫర్, తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ సత్తయ్య, డీఈ సత్యనారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.
