V6 News

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో  పాఠశాలలను తనిఖీ చేసిన కలెక్టర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో  పాఠశాలలను తనిఖీ చేసిన కలెక్టర్

ములకలపల్లి, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం ములకలపల్లి మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్​ను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పాఠశాలలోని తరగతి గదులను సందర్శించి విద్యార్థుల హాజరు, బోధన పద్ధతులు, వంట, భోజనశాలలు, ఆహార పదార్థాల నాణ్యత, మరుగుదొడ్లు, పరిశుభ్రత వంటి అంశాలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతపై ఆరా తీశారు. స్టూడెంట్స్​తో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేజీవీబీ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రీ-ఫైనల్ పరీక్షలను కలెక్టర్ పరిశీలించారు.