గ్రామీణ యువతకు స్థిర ఆదాయ మార్గాలు  : కలెక్టర్ జితేశ్ వి పాటిల్

గ్రామీణ యువతకు స్థిర ఆదాయ మార్గాలు  : కలెక్టర్ జితేశ్ వి పాటిల్

దమ్మపేట, వెలుగు : సేంద్రీయ వ్యవసాయం, పశుపక్షి పెంపకం, మత్స్య సాగు రైతులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామీణ యువతకు స్థిర ఆదాయ మార్గాలు కల్పిస్తున్నాయని కలెక్టర్ జితేశ్ వి పాటిల్, పశువర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ అమోయికుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని నాగుపల్లి, లింగాలపల్లి గ్రామాల్లో మహిళా సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కౌజు పిట్టల పెంపకం యూనిట్, కొర్ర మీను చేపల పెంపకం యూనిట్లను వారు పరిశీలించారు.

ఆక్వా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొర్రమీను చేపల పెంపకం యూనిట్​ను పరిశీలించారు. వారి వెంట ఎంపీడీవో రవీంద్రారెడ్డి, గ్రామ సమైక్య సభ్యులు, సర్పంచులు,  రైతులు ఉన్నారు.