ప్రభుత్వ భూములను కాపాడాలి : కలెక్టర్  కె. హైమావతి

ప్రభుత్వ భూములను కాపాడాలి :  కలెక్టర్  కె. హైమావతి

సిద్దిపేట రూరల్, వెలుగు: రెవెన్యూ రికార్డుల నిర్వహణ, ప్రభుత్వ భూముల సంరక్షణ సక్రమంగా చేయాలని కలెక్టర్  కె. హైమావతి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించి గ్రామాలు, మండలాలు, డివిజన్ల వారీగా వివిధ అంశాలపై రివ్యూ చేశారు. భూ భారతి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించడం, ప్రభుత్వ భూముల పరిరక్షణపై రివ్యూ చేసి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ పాలనలో రెవెన్యూ వ్యవస్థ చాలా ముఖ్యమైందని, భూ సంబంధిత సమస్యలపై ప్రధానంగా దృష్టి పెట్టాలన్నారు.

భూ పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం తీసుకువచ్చిన భూభారతి చట్టాన్ని పారదర్శకంగా అమలు చేసి భూ సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదేనని తెలిపారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అడిషనల్  కలెక్టర్  అబ్దుల్ హమీద్, డీఆర్వో నాగరాజమ్మ, సిద్దిపేట, హుస్నాబాద్  ఆర్డీవోలు సదానందం, రామ్మూర్తి, ఈడీఎం ఆనంద్  పాల్గొన్నారు.