నల్లబెల్లి, వెలుగు: వరంగల్ జిల్లా మూడు చెక్కలపల్లి గర్ల్స్ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ సత్యశారద సోమవారం తనిఖీ చేశారు. స్కూల్ పరిసర ప్రాంతాన్ని, వంటలను పరిశీలించి స్టూడెంట్లతో గంటపాటు క్లాస్ రూమ్లో మాట్లాడారు. రాత్రి పూట హాస్టల్ డ్యూటీలో ఎవరు ఉంటున్నారు? భోజనం టైమ్ ఎంటి.. విద్యా బోధన ఎలా ఉంది, తదితర వివరాలను స్టూడెంట్స్ను అడిగి తెల్సుకొన్నారు.
అనంతరం టీచర్లతో మాట్లాడారు. స్టూడెంట్లకు విద్యతో పాటు సామాజిక సాంస్కృతిక, సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని సూచించారు. హస్టళ్లలోని వంట గది, స్టోర్రూం, శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. కలెక్టర్వెంట నల్లబెల్లి తహసీల్దార్ ముప్ప కృష్ణ, పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్, ఏవో రజిత, సర్పంచ్ కవితదేవుసింగ్ ఉన్నారు.

