యాడ్ ఏజెన్సీలతో బల్దియా ఆఫీసర్ల కుమ్మక్కు

యాడ్ ఏజెన్సీలతో బల్దియా ఆఫీసర్ల కుమ్మక్కు
  • అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి 
  • హైకోర్టు సీనియర్ లాయర్ రాపోలు భాస్కర్​ డిమాండ్ 

ఖైరతాబాద్​,వెలుగు:  జంట నగరాల్లో వాణిజ్యప్రకటనల టెండర్ల​లో బల్దియా అధికారులు యాడ్​ఏజెన్సీలతో కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని  హైకోర్టు సీనియర్ లాయర్ రాపోలు భాస్కర్​ఆరోపించారు. బడా ఏజెన్సీలు ఇచ్చే కమీషన్లతో అధికారులు వారికే యాడ్ ​కాంట్రాక్ట్​ ఇస్తున్నారని, దీంతో చిన్న ఏజెన్సీలు మూత పడుతున్నాయని పేర్కొన్నారు.

సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  అక్రమాలకు పాల్పడుతున్న బల్దియా అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టులో రిట్​పిటిషన్ వేసినట్లు తెలిపారు. ఏసీబీ డైరెక్టర్​కు కూడా ఫిర్యాదు చేశానని ఆ కాపీని  చూపారు. ప్రభుత్వ జీవో నం. 68 ప్రకారం 15 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ప్రకటన బోర్డులు ఏర్పాటు చేస్తే రోజుకు రూ. లక్ష ఫైన్ వేయాలని చెప్పారు. యాడ్ ​ఏజెన్సీలు ప్రకటనలు వేసేందుకు పొందిన కాలపరిమితి ముగిసినా ఎలాంటి చర్యలుతీసుకోకుండా కంటిన్యూ చేస్తున్నారని ఆరోపించారు.

నిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.  ముఖ్యంగా రూల్స్​కు విరుద్ధంగా ప్రకటన బోర్డులను ఎత్తు పెంచితే గాలులు వీచినప్పుడు బోర్డులు కింద పడి అటుగా వెళ్లేవారు ప్రమాదాలకు గురవుతున్నట్లు చెప్పారు. ప్రకటనల ద్వారా బల్దియాకు ఏడాదికి  రూ. 145 కోట్ల ఆదాయం వస్తుందని, యాడ్​ఏజెన్సీ కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కవుతుండగా సంస్థ ఆదాయం కోల్పోతుందని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో  శోభారెడ్డి పాల్గొని మాట్లాడారు.