‘సర్’ పై 34 వేల పోలింగ్ స్టేషన్లకు కమిటీలు..బీఎల్ఏలకు 10 రోజుల్లో శిక్షణ: మంత్రి పొన్నం ప్రభాకర్

‘సర్’ పై 34 వేల పోలింగ్ స్టేషన్లకు కమిటీలు..బీఎల్ఏలకు 10 రోజుల్లో శిక్షణ: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, వెలుగు: ‘సర్’ పై రాష్ట్ర వ్యాప్తంగా 34 వేల పోలింగ్ స్టేషన్లకు కమిటీలను నియమించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం పీఏసీ సమావేశం అనంతరం ఆయన గాంధీ భవన్ లో  నిర్వహించిన ప్రెస్​మీట్​లో మాట్లాడారు. ప్రతి బూత్ ను ఒక యూనిట్ గా తీసుకొని, స్పెషల్​ఇంటెన్సివ్​రివిజన్​ను పరిశీలిస్తామన్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఎల్‌‌ఏలకు రాబోయే 10 రోజుల్లో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.