భగీరథ నీరు వస్తలేదని ప్రజాపాలనలో ఫిర్యాదులు : కలెక్టర్​ రాజీవ్​గాంధీ హన్మంతు

భగీరథ నీరు వస్తలేదని ప్రజాపాలనలో ఫిర్యాదులు : కలెక్టర్​ రాజీవ్​గాంధీ హన్మంతు
  • ఎక్కడా వాటర్​ ప్రాబ్లమ్​ఉండరాదు
  • ఎండాకాలం ప్లాన్​ రెడీ చేయండి
  • ఇంజినీర్లకు కలెక్టర్​ రాజీవ్​గాంధీ ఆదేశం 

నిజామాబాద్, వెలుగు : ఈనెల 6 వరకు నిర్వహించిన ప్రజాపాలనలో మిషన్​భగీరథ నీరు రావడం లేదని చాలా మంది ప్రజలు, స్థానిక సంస్థల ప్రతినిధులు ఫిర్యాదులు చేశారని కలెక్టర్​ రాజీవ్​గాంధీ హన్మంతు తెలిపారు. స్కీం పేర్లు ఏమున్నా వాటర్​ప్రాబ్లమ్​  రావడానికి వీలులేదని వార్నింగ్​ఇచ్చారు. వచ్చే ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని సమ్మర్​ యాక్షన్ ​ప్లాన్ ​సిద్ధం చేయాలని, గ్రౌండ్​ రియాల్టీతో ప్లాన్ ​రూపొందించాలన్నారు. బుధవారం ఆయన ఆర్​డబ్ల్యూఎస్​ఇంజినీర్లతో తన ఛాంబర్​లో మీటింగ్​ నిర్వహించారు. జిల్లాలో నీటి కొరత రాకుండా వార్​ఫూట్​పనులు చేపట్టాలన్నారు.

ఎక్కడ సమస్య వచ్చినా ఇంజినీర్లను బాధ్యులను చేస్తామన్నారు. విలేజ్​సెక్రెటరీలను సమన్వయం చేసుకొని నీటి ఎద్దడికి అవకాశమున్న కాలనీలను గుర్తించాలన్నారు. ఈ విషయంలో అంగన్​వాడీ సెంటర్లు, స్కూళ్లు, హాస్టళ్లు, రెసిడెన్షియల్​పాఠశాలల పరిస్థితి సమీక్షించాలన్నారు. ఎస్ఈ రాజేంద్రకుమార్, ఈఈలు రాకేశ్, నరేశ్, డీఈ, ఏఈలు ఉన్నారు.