బోధన్, వెలుగు: ఈ నెల 6 నుంచి జూన్12 వరకు నిర్వహించే ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికను సక్సెస్చేయాలని ప్రభుత్వ సలహాదారుసుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. బోధన్ సబ్ కలెక్టర్ ఆఫీసు బోధన్ డివిజన్ స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. డివిజన్ లోని బోధన్, సాలురా, ఎడపల్లి, రెంజల్, నవీపేట్ మండలాల్లోని అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ కిరణ్ కుమార్, ఇన్చార్జి ఆర్డీవో నగేశ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి పాల్గొన్నారు.
