నిజామాబాద్, వెలుగు: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం నిజామాబాద్ నగరంలో 2కే రన్ జరిగింది. ప్రోగ్రామ్‌కు ప్రచారం కల్పించడంతో పాటు ప్రజలందరినీ భాగస్వామ్యులను చేసేందుకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కంఠేశ్వర్ బైపాస్ రోడ్ నుంచి ఓల్డ్ ఆర్డీవో ఆఫీస్‌దాకా కొనసాగిన రన్‌ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మేయర్ ఉమారాణి జెండాఊపి ప్రారంభించారు.
నగరాన్ని శుభ్రంగా తీర్చిదిద్దడానికి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్‌లో మొదలుపెట్టిన కార్యక్రమంలో శానిటేషన్ కార్మికులతో కలిసి మేయర్ చీపురుపట్టి ఊడ్చారు. నగర పాలక కమిషనర్ దిలీప్‌కుమార్, డిప్యూటీ కమిషనర్ రవిబాబు, తహసీల్దార్ విజయ్‌కాంత్‌రావు ఉన్నారు.
