వైద్య విధాన పరిషత్​లో పంపకాలు పూర్తి

వైద్య విధాన పరిషత్​లో పంపకాలు పూర్తి

హైదరాబాద్, వెలుగు: ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల పంపకం పూర్తయింది. ఈ మేరకు రెండు రాష్ర్టాలకు కేటాయించిన ఉద్యోగులు, పోస్టుల వివరాలతో ఏపీ ప్రభుత్వం బుధవారం జీవో విడుదల చేసింది. మొత్తం 2,984 పోస్టులకు గానూ ఏపీకి 1,612, తెలంగాణకు 1,372 పోస్టులను కేటాయించారు. ఖాళీలు పోను.. ప్రస్తుతం పనిచేస్తున్న 1,151 మంది ఉద్యోగుల్లో 567 మందిని తెలంగాణకు, 584 మందిని ఏపీకి కేటాయించారు.