మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను వర్సిటీ వీసీ జీఎన్.శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేశ్‌బాబు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. కంప్యూటర్ అప్లికేషన్లలో విద్యార్థులు నైపుణ్యం పెంచుకొని, ఉత్తమ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించాలని సూచించారు.
కార్యక్రమంలో ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకిరణ్, హెచ్‌వోడీ రామరాజు, అకాడమిక్కోఆర్డినేటర్రవికుమార్, న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ మాలవి, వైస్ ప్రిన్సిపాల్ భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
