వనపర్తి, వెలుగు: ఉభయ తెలుగు రాష్ట్రాలలో డీసీసీ అధ్యక్షుల కోసం నిర్వహించిన సంఘటన సృజన్ అభియాన్ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి వచ్చిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని డీసీసీ అధ్యక్షుడు, శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి కలిశారు. సోమవారం వికారాబాద్ జిల్లా అనంతగిరి పర్యాటక ప్రాంతంలో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. శివసేనా రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. రాహుల్ గాంధీ, శివసేన రెడ్డితో రాష్ట్రంలో క్రీడా సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న క్రీడాంశాలపై, జిల్లాలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
నల్గొండ అర్బన్ : నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత సోమవారం రాహుల్ గాంధీతో తన కుటుంబంతో సహా హాజరై భేటీ అయ్యారు. వికారాబాద్ లోని హరిత రిసార్ట్స్ లో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ జిల్లాల అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు సమావేశానికి హాజరైన రాహుల్ గాంధీని పున్న కైలాష్ నేత కుమారుడు జయంత్ విక్రమ్ కలిశారు. ఫొటో జ్ఞాపికను అందజేశారు.
