బాల్క సుమన్ వ్యాఖ్యలతో ఉద్యోగుల్లో ఆందోళన: సీఎంవోఏఐ సింగరేణి అధ్యక్షుడు

బాల్క సుమన్ వ్యాఖ్యలతో ఉద్యోగుల్లో ఆందోళన: సీఎంవోఏఐ సింగరేణి అధ్యక్షుడు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్​ వ్యాఖ్యలతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందని కోల్​మైన్స్​ ఆఫీసర్స్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా సింగరేణి అధ్యక్షుడు లక్ష్మీపతి గౌడ్​ తెలిపారు. కొత్తగూడెంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణి జీఎం ఆఫీసులు, సింగరేణి భవన్​ను తగలబెట్టాలని పిలుపునివ్వడం దారుణమన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది సింగరేణిపై బతుకుతున్నారని గుర్తు చేశారు.

ఇప్పటికే బొగ్గు బావులు మూత పడుతుండడం, కొత్త బావులు ప్రారంభం కాక యాజమాన్యంతో పాటు ఉద్యోగులు ఆందోళన చెందుతున్న క్రమంలో సుమన్​ వ్యాఖ్యలు సంస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలతో సంస్థలో అశాంతి పెరిగి, ఉత్పత్తి, ఉత్పాదకతలపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించిన ఆయన సింగరేణి ఆస్థులను తగలబెట్టాలని పిలుపునివ్వడం విచారకరమన్నారు.