టీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య.. బతుకమ్మ చీరల పంపిణీ చిచ్చు

టీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య.. బతుకమ్మ చీరల పంపిణీ చిచ్చు

మిర్యాలగూడ: పట్టణంలోని అధికార టీఆర్ఎస్​ పార్టీ కౌన్సిలర్ల మధ్య బతుకమ్మ చీరల పంపిణీ చిచ్చు రేపింది. తాళ్లగడ్డలో   పలువురు ఏర్పాటు చేసిన  ఫ్లెక్సీలో ఉన్న  అధికార పార్టీ 3వ వార్డు కౌన్సిలర్  బంటు రమేష్  ఫొటో   దగ్ధం చేసిన సంఘటన శుక్రవారం వారం ఆలస్యంగా  వెలుగులోకి వచ్చింది.  మున్సిపాలిటీ పరిధిలోని 1,2,3  చైతన్య నగర్,తాళ్లగడ్డ_చైతన్యనగర్​, తాళ్లగడ్డ ​ వార్డుల పరిపధిలో  80 శాతం మందికిపైగా బతుకమ్మ చీరల పంపిణికీ చేసిన సంగతి తెలిసిందే. 
ఈ నెల 13వ తేదీన 3వ వార్డు తాళ్లగడ్డకు చెందిన పలువురు మహిళలు బతుకమ్మ చీరలను తెచ్చుకునేందుకు వెళ్లారు. వార్డుల్లోని రేషన్​ షాపుల్లో లబ్ధిదారుల సీరియల్​ ప్రకారం కాకుండా ...2వ వార్డు చైతన్య నగర్​తాళ్లగడ్డ మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నారని  3వ వార్డు కౌన్సిలర్ బంటు రమేష్ వెళ్లి​ 2వ వార్డు కౌన్సిలర్ భర్తను నిలదీశాడు. ఈ నేపథ్యంలో ఇరువురి మద్య వాగ్వివాదం జరిగింది. అనంతరం ఇరువురు ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ తర్వాత  ఫ్లెక్సీలో  ఫోటో దగ్ధం చేయడంతో 3వ వార్డు కౌన్సిలర్ బంటు రమేష్ వన్​టౌన్​ పీఎస్​లో కౌన్సిలర్ ఫిర్యాదు చేశారు. విచారణ జరుపుతున్నామని వన్​టౌన్​ సీఐ శ్రీనివాస్​గౌడ్​ తెలిపారు.