తెలంగాణలో కాంగ్రెస్-బీజేపీ చీకటి ఒప్పందం: మంత్రి హరీష్ రావు

తెలంగాణలో కాంగ్రెస్-బీజేపీ చీకటి ఒప్పందం: మంత్రి హరీష్ రావు

మెదక్: దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయని మంత్రి హరీష్ రావు విమర్శించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో తెలీదని ఆయన ఎద్దేవా చేశారు. మెదక్ పట్టణంలో పలువురు కాంగ్రెస్ కౌన్సిలర్లు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. విపక్షాల పై విరుచుకుపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని తిట్టినా అవి తమకు దీవెనలే అవుతాయని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో 3 బిల్లులు పెడితే  రైతులు నష్టపోతున్నారని.. కార్పొరేట్ వ్యవస్థ వస్తుందని మేము చెప్పినా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో కేవలం 3 గంటలు కరెంట్ ఇస్తే మేము మా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 24 కరెంటు ఇస్తున్నామన్నారు. అలాగే  రైతులకు పంట వేసుకోవడానికి ప్రభుత్వం పెట్టుబడి సహాయం చేస్తోందన్నారు. ప్రతి రైతు కు 5 లక్షల ఉచిత బీమా పథకం అమలు చేసింది తమ ప్రభుత్వమే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రైతులకు నీరు అందిస్తున్న ఘనత తమకే దక్కుతోందన్నారు. మరో వైపు భూసేకరణ చేసి పరిశ్రమలు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నాము.. పేద ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని మంత్రి హరీష్ రావు వివరించారు.