మునుగోడు అభివృద్ధిపై ఎక్కడైనా సరే చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి సవాల్ విసిరారు. ఈ ప్రాంత ప్రజల సమస్యలపై ఎవరికెంత అవగాహన ఉందో చూద్దామన్నారు. మునుగోడు ప్రజల ఆవేదన ఎవరికి ఎక్కువ అర్థమవుతుందో తేల్చుకుందామన్నారు. ప్రలోభాలకు గురి చేసే వారికి మునుగోడు ప్రజలు త్వరలోనే బుద్ది చెబుతారన్నారు. ఆడబిడ్డ శక్తి ఏమిటో మునుగోడు ప్రజలు ఉపఎన్నికలో చూపబోతున్నారన్నారు.
తంగేడుపల్లిలో పాల్వాయి స్రవంతి రేవంత్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. మద్యంతో ఎన్నికల్లో గెలవాలని అనుకునే వారికి తగిన బుద్ధి చెప్పాలని... మీ భవిష్యత్తును మద్యానికి, డబ్బులకు తాకట్టు పెట్టొద్దని సూచించారు. మీ ఓటుతో తనను ఆశీర్వదిస్తే.. ప్రాణం ఉన్నంత వరకు మీ కోసం కొట్లాడుతానని పాల్వాయి స్రవంతి అన్నారు.
మునుగోడులో గెలుపు కోసం అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి నుంచి మంత్రులు,ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇవాళ్టి నుంచి ప్రచారం షురు చేశారు. ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా మునుగోడులో పాల్వాయి స్రవంత తరపున ప్రచారం చేస్తున్నారు.
