జూబ్లీహిల్స్ గెలుపుతో గాంధీభవన్లో సంబురాలు

జూబ్లీహిల్స్  గెలుపుతో గాంధీభవన్లో సంబురాలు

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్​అభ్యర్థి నవీన్​యాదవ్ గెలుపుతో గాంధీ భవన్ లో సంబురాలు మిన్నంటాయి. రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి ఆధ్వర్యంలో పార్టీలోని వివిధ స్థాయిల్లోని కార్యకర్తలు డప్పు చప్పుళ్లతో డ్యాన్సులు చేస్తూ, పటాకులు కాల్చుతూ, రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. ఈ సంబురాల్లో మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తోపాటు వందలాది మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

2028 లో రఫా.. రఫా’’ అనే పదాలతో  సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలను, ‘‘తగ్గేదేలే..2028 లో 100 సీట్లు’’ అనే ఫ్లెక్సీలను పట్టుకొని పార్టీ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సందర్భంలో కనిపించిన సంతోషం, ఉత్సాహం మళ్లీ రెండేండ్లకు ఈ ఎన్నికలో గెలుపుతో క్యాడర్ లో కనిపించింది. గాంధీ భవన్ ఆవరణ, దాని చుట్టు పక్కల ప్రాంతాలు వందలాది మంది కార్యకర్తలతో సందడిగా కనిపించాయి.