V6 News

కౌలాలంపూర్‎లో మోడీ ‘హగ్లోమసీ’ ఏదీ..? కాంగ్రెస్

కౌలాలంపూర్‎లో మోడీ ‘హగ్లోమసీ’ ఏదీ..? కాంగ్రెస్

న్యూఢిల్లీ: రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలును ఇండియా ఆపేస్తోందంటూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరోసారి కామెంట్ చేసిన నేపథ్యంలో ప్రధాని మోదీపై కాంగ్రె స్ విమర్శనాస్త్రాలు సంధించింది. ఆసియాన్ సమిట్ జరుగుతున్న కౌలాలంపూర్‎లో ఆదివారం మోదీ ‘హగ్‎లో మసీ(కౌగిలింతల దౌత్యం)’ కనిపించకపోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదని ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. 

‘‘శనివారం రాత్రి కౌలాలంపూర్‎కు బయలుదేరిన ట్రంప్.. విమానంలోనే మీడియాతో మాట్లాడారు. రష్యన్ క్రూడ్ ఆయిల్‎ను  తగ్గించుకుంటామని మోదీ హామీ ఇచ్చారని ఇన్నిరోజులూ చెప్తూ వచ్చిన ఆయన.. ఈసారి ఇండియా రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను పూర్తిగా ఆపేస్తోందని అన్నారు. 

అందుకే కౌలాలంపూర్‎లో ఆసియాన్ సమిట్‎కు వెళితే.. ట్రంప్ తనను కార్నర్ చేస్తారన్న భయంతోనే మోదీ వెళ్లలేదు. అందుకే కౌలాలంపూర్‎లో మోదీ ‘హగ్ లోమసీ కనిపించకపోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు” అని జైరాం అన్నారు. కాగా, ఆపరేషన్ సిందూర్‎ను ఆపానని 53 సార్లు, రష్యన్ ఆయిల్ కొనుగోళ్లు ఇండియా తగ్గిస్తోందంటూ ఐదు సార్లు ట్రంప్ కామెంట్లు చేశారని జైరాం ఇదివరకు చెప్పారు.