స్టూడెంట్స్ ఆందోళనలపై చర్చకు కాంగ్రెస్ డిమాండ్ : లోక్ సభ వాయిదా వేసి వెళ్లిపోయిన స్పీకర్

స్టూడెంట్స్ ఆందోళనలపై చర్చకు కాంగ్రెస్ డిమాండ్ : లోక్ సభ వాయిదా వేసి వెళ్లిపోయిన స్పీకర్

విపక్ష సభ్యుల ఆందోళనలతో లోక్ సభ దద్ధరిల్లింది. స్టూడెంట్స్ లాఠీఛార్జీ్, ఆందోళనలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్, పేపర్ లీక్ వల్ల చనిపోయిన స్టూడెంట్స్ కు న్యాయం చేయాలని.. నీట్ పేపర్ లీక్ చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఈ అంశాలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ.. వాయిదా తీర్మానం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 

ప్రధాని మోదీ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ.. విద్యార్థులపై నిరంకుశంగా వ్యవహరిస్తుంది.. నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలపై పోలీసులతో దాడులు చేయిస్తుందంటూ సభలో నినాదాలు చేశారు కాంగ్రెస్ పార్టీ ఎంపీలతోపాటు.. ఇతర ప్రతిపక్ష పార్టీ ఎంపీలు. ప్రధాని మోదీ ప్రభుత్వం తీరుకు నిరసనగా విపక్ష ఎంపీలు అందరూ నల్ల చొక్కాలతో సభకు హాజరయ్యారు. నీట్ పేపర్ లీక్ కు సంబంధించి విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలి.. జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపై లాఠీఛార్జి చేసిన.. వాళ్ల రక్తం కళ్ల చూసిన హోం మంత్రి అమిత్ షా, ప్రదాని మోదీ రాజీనామా చేయాలంటూ సభలో నినాదాలు చేశారు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. 

ALSO READ : పార్లమెంట్ దగ్గర టెన్షన్... నల్ల దుస్తులతో కాంగ్రెస్ ఎంపీలు నిరసన

లోక్ సభ ప్రారంభం అయిన వెంటనే.. చైర్ లోకి వచ్చిన స్పీకర్ ఓం బిర్లా.. సభను ఆర్డర్ లో పెట్టటానికి పదే పదే విజ్ణప్తి చేశారు. వాయిదా తీర్మానంపై చర్చించాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేయటంతో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే సభకు వాయిదా వేసి వెళ్లిపోయారు స్పీకర్.