రాహుల్ అరెస్ట్ విషయంపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీలు నల్ల దుస్తులతో పార్లమెంట్ కు హాజరయ్యారు. నిన్న ( జులై 21) జరిగిన ఘటన గురించి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ పార్లమెంట్ దగ్గర మీడియాతో మాట్లాడారు.
మోదీ ప్రభుత్వం.. కాంగ్రెస్నేతలను.. విద్యార్థులను రెచ్చగొడుతుందన్నారు. రాహుల్ గాంధీ ముక్కుకు దెబ్బ తగిలినా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరసన చేపట్టారు. ఉభయ సభల్లో విద్యార్థుల సమస్యల గురించి చర్చించాలని ఆమె డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం రోడ్డెక్కిన విద్యార్థులపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారన్నారు. ప్రజా సమస్యల గురించి విపక్షాలను బీజేపీ ప్రభుత్వం సభలో మాట్లాడనివ్వడం లేదని కేంద్రం తీరును ప్రియాంక గాంధీ ఎండగట్టారు. యువకులంతో మోదీకి ఓటేస్తేనే ఆయన అధికారంలోకి వచ్చారని అయినా వాళ్ల సమస్యల గురించి పట్టించుకోవడం లేదన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యేవరకు కాంగ్రెస్ పోరాడుతుందని ప్రియాంకగాంధీ అన్నారు.
ALSO READ : తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా కట్టడికి చర్యలు
