అధికారంలోకి వస్తే ఫ్రీ కరెంట్: కర్ణాటక కాంగ్రెస్

అధికారంలోకి వస్తే ఫ్రీ కరెంట్: కర్ణాటక కాంగ్రెస్

కర్ణాటకలో అధికారంలోకి వస్తే గృహ జ్యోతి యోజన కింద ప్రతి ఇంటికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత కరెంటు అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. మేలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్లను ఆకట్టుకునేందుకు మొదటి హామీగా కాంగ్రెస్ దీనిని ప్రకటించింది. ఇది దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలకు మాత్రమే పరిమితం కాదని రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఈ హామీ వర్తిస్తుందని ఆ పార్టీ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌ వెల్లడించారు.  ప్రస్తుతం ఢిల్లీ,పంజాబ్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈ పధకాన్ని అమలు చేస్తోంది.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా జనవరి 16న కర్ణాటకలో పర్యటిస్తున్నారని డీకే శివకుమార్ తెలిపారు. తన పర్యటనలో ఆమె కాంగ్రెస్ రెండో హామీని ప్రకటిస్తారని తెలిపారు. ఈ హామీ మహిళల కేంద్రంగా ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్  చేసిన ఉచిత విద్యుత్ హామీపై అధికార బీజేపీ విమర్శలు చేస్తోంది. వారి వాగ్దానం కేవలం హామీగా మిగిలిపోతుందని బీజేపీ ఎమ్మెల్యే రవికుమార్ అన్నారు. ఇది వారి మరో పోల్ ప్లాంక్ మాత్రమేనని విమర్శించారు.