కాంగ్రెస్ సభను సక్సెస్ చేయాలి : గడ్డం ప్రసాద్ కుమార్

కాంగ్రెస్ సభను సక్సెస్ చేయాలి : గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్​/ ముషీరాబాద్, వెలుగు: హైదరాబాద్​లోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం జరిగే కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుల సమ్మేళనం, బహిరంగ సభను జయప్రదం చేయాలని అసెంబ్లీ స్పీకర్  గడ్డం ప్రసాద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు అనిల్​కుమార్​యాదవ్​ పిలుపునిచ్చారు. గురువారం వికారాబాద్, ముషీరాబాద్​ గాంధీనగర్​లో వేర్వేరుగా  జరిగిన సమావేశాల్లో వారు మాట్లాడారు. సమ్మేళనంలో గ్రామ అధ్యక్షులకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. 

ఈ కార్యక్రమంలో వికారాబాద్​ డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్​ పార్టీ ఇన్​చార్జి బొంతు రాంమోహన్​, సహ ఇన్​చార్జిలు సుబ్బారావు, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, తాండూర్​ ఎమ్మెల్యే బి.మనోహర్​రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్​ కిషన్​ నాయక్, ముషీరాబాద్​ నాయకులు కత్తి పద్మారావు, పాశం అనిల్ కుమార్ యాదవ్, వాజీద్ హుస్సేన్  పాల్గొన్నారు.