పుదుచ్చేరి : బలపరీక్షలో విఫలమయ్యారు పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి. దీంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ నుంచి రాజీనామ లేఖతో రాజ్ భవన్ కు బయల్దేరారు నారాయణస్వామి. ప్రతిపక్షాలకు 14 మంది ఎమ్మెల్యేలు…. అధికార కూటమికి 12 మంది ఎమ్మెల్యేలే ఉండటంతో…. బల నిరూపణలో విఫలమయ్యారు నారాయణ స్వామి. కాసేపట్లో రాజ్ భవన్ కు వెళ్లనున్నారు నారాయణ స్వామి. మొత్తంగా ఏడుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో కాంగ్రెస్-DMK కూటమి ప్రభుత్వం మైనారిటీలో పడింది. పుదుచ్చేరీ అసెంబ్లీలో 30 సీట్లు ఉండగా, 3 నామినేటెడ్ సీట్లు ఉన్నాయి.
ఆ ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు బీజేపీ వారే. ప్రస్తుతం అధికార కూటమికి 12 మంది, ప్రతిపక్షాలకు 14మంది ఎమ్మెల్యేల బలముంది. కాంగ్రెస్, DMK రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలతో 7 స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 26కు తగ్గింది. కాంగ్రెస్, డీఎంకే కూటమి బలం 12కు తగ్గింది. ఇందులో కాంగ్రెస్ కు 9, DMK 2, ఒక ఇండిపెండెంట్ ఉన్నారు. ప్రతిపక్షాలకు 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో మాజీ సీఎం రంగస్వామి నేతృత్వంలోని ఆల్ ఇండియా N.R.కాంగ్రెస్ కు ఏడుగురు, AIADMKకు నలుగురు ఎమ్మెల్యేలున్నారు. బీజేపీకి ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలున్నారు.
