ఇది ఆటోనా.. లేక విమానమా? టీవీ, ఫ్యాన్, బుక్స్.. బెంగళూరు ఆటో నెట్టింట వైరల్

ఇది ఆటోనా.. లేక విమానమా? టీవీ, ఫ్యాన్, బుక్స్.. బెంగళూరు ఆటో నెట్టింట వైరల్

బెంగళూరు అంటేనే ట్రాఫిక్ కష్టాలు, వెరైటీ ఘటనలు. అయితే ఈసారి ఒక ఆటో డ్రైవర్ క్రియేటివిటీ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా ఆటో అంటే 3 చక్రాలు, పైన ఒక టార్పాలిన్ షీట్ ఉంటుంది. కానీ ఈ ఆటోలోకి ఎక్కితే మాత్రం మీరు ఏదో విమానంలోని బిజినెస్ క్లాస్‌లోనో లేదా ఒక లగ్జరీ హోటల్ రూమ్‌లోనో ఉన్నామని ఫీలవుతారు. పూర్ణ అనే మహిళ తాను ఎక్కిన వింత ఆటో వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఇప్పుడు అది ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

ఫెసిలిటీస్ చూస్తే మైండ్ బ్లాకే..
ఆటోలో ఉన్న ఫీచర్లు చూస్తుంటే.. విమానంలో కంటే ఎక్కువ సౌకర్యాలు ఉన్నాయేమో అనిపించక మానదు. బయట మండిపోతున్న ఎండల నుంచి రక్షణ కోసం చుట్టూ రంగురంగుల కర్టెన్లు, లోపల కూర్చుంటే చల్లటి గాలి కోసం ఒక ఫ్యాన్ ఏర్పాటు చేశాడు సదరు డ్రైవర్. అంతటితో ఆగిపోతే అది బెంగళూరు ఆటో ఎలా అవుతుంది? ప్రయాణికులు బోర్ కొట్టకుండా ఉండేందుకు ఒక టీవీ యూనిట్, బుక్స్ చదువుకోవడానికి ఒక చిన్న పుస్తకాల అర, ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్లగ్ పాయింట్లు కూడా అందులో ఉన్నాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Poorna (@poorna_101)

నా రూమ్ కంటే ఇందులోనే ఫెసిలిటీస్ ఎక్కువ..
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తాను అద్దెకు ఉంటున్న రూమ్ కంటే ఈ ఆటోలోనే ఎక్కువ సౌకర్యాలు ఉన్నాయని ఒకరు కామెంట్ చేయగా, ఇది ఆటో కాదు, చక్రాలున్న ఒక లౌంజ్ అని మరొకరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక మహిళా ప్రయాణికురాలిగా తన సౌకర్యం కోసం ఆటో డ్రైవర్ పడుతున్న తాపత్రయం చూసి పూర్ణ ఆశ్చర్యపోయింది. సాధారణ ఆటో ప్రయాణాన్ని ఒక 'మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్'గా మార్చేసిన ఆ డ్రైవర్ ఆలోచనకు ఇప్పుడు అందరూ ఫిదా అవుతున్నారు.

►ALSO READ | ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు అమర్చిన.. ఐఈడీ బాంబు పేలి ముగ్గురు జవాన్లు మృతి

కేవలం డబ్బు సంపాదించడమే కాకుండా.. తన దగ్గరకు వచ్చే కస్టమర్ సుఖంగా ఉండాలని ఆలోచించిన ఆ డ్రైవర్ డెడికేషన్‌కు నెటిజన్లు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తున్నారు. బెంగళూరు ఆటో డ్రైవర్లు ఇప్పుడు నెక్స్ట్ లెవల్ గేమ్‌ ఆడుతున్నారని, ఇలాంటి ఆటో ఎక్కిన తర్వాత వేరే సాధారణ ఆటో ఎక్కితే కచ్చితంగా అసంతృప్తి కలుగుతుందని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా, ఆ చిన్న ఆటోలో ఒక ప్రపంచాన్ని సృష్టించిన ఆ డ్రైవర్ ఇప్పుడు సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిపోయాడు.