మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ 

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ 

ఖానాపూర్,  వెలుగు: మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటే ల్ అన్నారు. ఖానాపూర్ పట్టణంలో ప్రభుత్వం తరఫున గురువారం ముస్లింల కు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నివర్గాల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు.

పండుగలను ప్రతిఒక్కరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూ చించారు. ఇఫ్తార్‌‌‌‌ విందులో మార్కెట్ కమిటీ వైస్ చైర్‌‌‌‌పర్సన్‌‌ అబ్దుల్ మాజీద్, జామ మసీదు కమిటీ అధ్యక్షుడు జహీర్, కౌన్సిల్ సభ్యులు రమేశ్, జామల్, గొర్రె గంగాధర్, ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం, మున్సిపల్ మాజీ చైర్‌‌‌‌పర్సన్‌‌ సత్యం, లీడర్లు పాల్గొన్నారు.