- టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి
ఉప్పల్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలంగాణ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్(టీటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో శనివారం తార్నాకలోని మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్‌లో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం డాక్టర్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుల త్యాగాలను ఎప్పటికీ మరిచిపోదన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారులను గౌరవిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. సమావేశంలో ఉద్యమకారులు దయానంద్ గంగపుత్ర, జగన్, నరసింహాచారి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

