కాంగ్రెస్​ గ్రాఫ్​ పెరుగుతున్నది.. కాళేశ్వరం సీఎంకు ఏటీఎంలా మారింది: అశోక్​ చవాన్​

కాంగ్రెస్​ గ్రాఫ్​ పెరుగుతున్నది.. కాళేశ్వరం సీఎంకు ఏటీఎంలా మారింది: అశోక్​ చవాన్​
  •     కమీషన్ల కోసమే అంచనాలు పెంచారని కామెంట్​
  •     సోనియా ముందు చెంపలేసుకో కేసీఆర్: రేణుకా చౌదరి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రోజురోజుకూ కాంగ్రెస్ ​ గ్రాఫ్​ పెరుగుతున్నదని మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ ​చవాన్​ అన్నారు. కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరితో కలిసి గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. రాహుల్​గాంధీ కాళేశ్వరం(మేడిగడ్డ) పర్యటన తర్వాత అనేక నిజాలు బయటపడుతున్నాయని అశోక్​చవాన్​ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్​కుటుంబానికి ఏటీఎంలా మారిందన్నారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టు అంచనా వ్యయాలను భారీగా పెంచారన్నారు. కాంగ్రెస్​ పార్టీ మొదలుపెట్టిన అంబేద్కర్ ​సుజల స్రవంతి ప్రాజెక్టును బీఆర్ఎస్​పార్టీ కాళేశ్వరంగా మార్చిందని ఆరోపించారు. కాళేశ్వరం పేరు చెప్పుకుని బీఆర్ఎస్​ఓట్లు దండుకుందన్నారు. ఆ ప్రాజెక్ట్​పై బీజేపీ ఎన్ని విమ ర్శలు చేసినా.. చర్యలు మాత్రం తీసుకోవడం లేద న్నారు. ప్రాజెక్ట్​పై చేసిన ఖర్చంతా తెలంగాణ ప్రజ లపై అప్పుగా మారిందని, రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ట్రాక్​రికార్డ్​కాంగ్రెస్​కు ఉందని పేర్కొన్నారు. అంతకుముందు గాంధీభవన్​లో కాళేశ్వరం అవినీతి ఏటీఎంను ఏర్పాటు చేశారు. కాళేశ్వరం అక్రమాలపై రాహుల్​ చేసిన కామెంట్లు, మేడిగడ్డ బ్యారేజీ పరిశీలన డాక్యుమెంటరీలను ప్రదర్శించారు.

8 వేల మంది రైతులు చనిపోయారు

కాళేశ్వరం ఫెయిల్యూర్​అని కేసీఆర్​ఒప్పుకొని సోనియా గాంధీ ముందు చెంపలు వేసుకోవాలని రేణుకా చౌదరి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​తో బంగారమంతా కేసీఆర్​ కుటుంబానికే చేరిం దని ఎద్దేవా చేశారు. ధరణి పోర్టల్​తో అసైన్డ్​భూ ములను దోచుకున్నారని మండిపడ్డారు. కాళేశ్వ రం ప్రాజెక్ట్​ విషయంలో క్వాలిటీ కంట్రోల్​ఏమైం దని ప్రశ్నించారు. ప్రాజెక్ట్​ భవిష్యత్​ ఏంటో చెప్పాలన్నారు. పంటకు మద్దతు ధర అడిగితే రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ దన్నారు. కాంగ్రెస్​ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నదని, ధరణి పోర్టల్​తో సామాన్యుడికి మేలు జరిగిందా అని నిలదీశారు. కేజీ టు పీజీ చదువేదో బీఆర్​ఎస్​ నేతలు చదువుకుంటే బాగుండేదని ఎద్దేవా చేశారు.