- పొంగులేటి ప్రసాద్ రెడ్డి, డాక్టర్ మట్టా దయానంద్
కల్లూరు, వెలుగు : దశాబ్దాలుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న కస్టోడియన్, అసైన్మెంట్ భూములకు పట్టా హక్కులు కల్పిస్తామని, ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, పొంగులేటి ప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. కల్లూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆదివారం కల్లూరు పట్టణ మెయిన్ సెంటర్ లోని జాతీయ రహదారి ప్రక్కన చాపల మార్కెట్ ఏరియాలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అనంతరం హనుమా తండా ఏడో వార్డు పరిధిలో బంజారా గిరిజన ప్రజల ఆత్మీయ సమ్మేళనంలో వారు పాల్గొని మాట్లాడారు. కల్లూరు మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఏడో వార్డు అభ్యర్థి ధరావత్ మోహన్ నాయక్ ను ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఏఎంసీ చైర్పర్సన్ నీరజాప్రభాకర్ చౌదరి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
