మేడ్చల్ ప్రజలకు పట్టిన శని మల్లారెడ్డి : రాజేశ్

మేడ్చల్ ప్రజలకు పట్టిన శని మల్లారెడ్డి :  రాజేశ్

ఘట్‌ కేసర్, వెలుగు: మేడ్చల్ ప్రజలకు పట్టిన శని మంత్రి మల్లారెడ్డి అని జిల్లా  కాంగ్రెస్ అధ్యక్షుడు కర్రె రాజేశ్ అన్నారు. ప్రతాపసింగారంలో డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద కాంగ్రెస్ నాయకులు ఆదివారం నిరసన తెలిపారు. ఈసందర్భంగా  రాజేశ్ మాట్లాడుతూ..   కనీసం ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూం ఇండ్లను ఇవ్వలేని వ్యక్తి  మంత్రి మల్లారెడ్డి అని విమర్శించారు.  

ఘట్ కేసర్ మండలం ప్రతాప సింగారంలో  నిర్మించిన 2,208 ఇండ్లను స్థానికులకు కాకుండా మేడ్చల్ జిల్లాకు సంబంధం లేని వాళ్లకు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. మేడ్చల్ ప్రజలకు న్యాయం చేయలేని దద్దమ్మ మంత్రి మల్లారెడ్డి అని  విమర్శించారు.  వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గ  ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మల్లారెడ్డిని ఓడిస్తారని అన్నారు. స్థానిక ప్రజలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కర్రె జంగమ్మ, చౌదర్ గూడా ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, కట్ట ఆంజనేయులు, యూత్ కాంగ్రెస్ నాయకులు వినోద్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు నరసింహ,  గ్రామ శాఖ అధ్యక్షుడు అమర్,  సల్మాన్ జంగయ్య,  నత్తి కృష్ణ, వెంకట్ రెడ్డి ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.